: హత్య కేసులో కర్నూలు జడ్పీ చైర్మన్ సోదరుడి అరెస్ట్
హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్ సోదరుడు మల్లెల వెంకటరమణను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. స్నేహితులతో కలిసి ఇటీవల నగర శివారులోని ఓ దాబాకు వెళ్లిన వెంకటరమణ తన సోదరుడి హోదాను ప్రస్తావించి దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఘర్షణలో దాబాకు చెందిన ఓ కార్మికుడు చనిపోయాడు. దీనిపై దాబా నిర్వాహకుడి ఫిర్యాదుతో వెంకటరమణపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న వెంకటరమణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఆయన అనుచరులను దఫ దఫాలుగా ప్రశ్నించిన పోలీసులు వెంకటరమణ ఆచూకీపై స్పష్టమైన సమాచారం తీసుకుని నిన్న రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ అరెస్ట్ కు సంబంధించి నేడు పోలీసులు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.