: డబ్బు సంపాదనే నా లక్ష్యం: 'అమెజాన్' అధినేత
నూతన సంవత్సరంలో ఇంకా ఇంకా డబ్బు సంపాదించడమే తన లక్ష్యమని ప్రముఖ ఇంటర్నెట్ రిటైలర్ 'అమెజాన్' అధినేత జెఫ్ బిజోస్ తెలిపారు. నూతన సంవత్సర లక్ష్యాల గురించి ఆయనను సంప్రదించిన మీడియా ప్రతినిధులకు డబ్బు సంపాదనే లక్ష్యమని సమాధానం ఇచ్చారు. నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యక్తిగత సంపాదనతో ప్రపంచ ధనికుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచినప్పటికీ సంపాదనలో తన లక్ష్యం నెరవేరలేదని జెఫ్ బిజోస్ తెలిపారు. ఈయన అమెజాన్ లో కేవలం 18 శాతం వాటా మాత్రమే కలిగి ఉన్నప్పటికీ, ఇప్పటికే ఫేస్ బుక్, గూగుల్ సంస్థల యజమానుల సంపాదనను జెఫ్ దాటేయడం విశేషం. హాలీవుడ్ లో ప్రవేశించి, ఏడాదికి 16 సినిమాలు నిర్మించడం ద్వారా ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు సాధిస్తానని ఆయన చెప్పారు. ఇంత సంపాదించినా దానధర్మాలకు పది పైసలు కూడా విదల్చరనే విమర్శలు వస్తుండడంతో, ఆయన ఈ మధ్యే వెయ్యి నుంచి పది వేల డాలర్లు వితరణకు వెచ్చించారు.