: మోదీకి అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడి ఫోన్


అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పఠాన్ కోట్ ఘటనపై ఆరాతీశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన సైనిక సిబ్బందికి సంతాపం ప్రకటించారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ లోని మజార్-ఐ-షరీఫ్ నగరంలో భారత రాయబార కార్యాలయంపై ఉగ్రదాడి ఘటనపై మోదీ ఆరాతీశారు. ఘటన జరిగిన తీరు, తీవ్రవాదులను భద్రతా సిబ్బంది అడ్డుకున్న విధానం మోదీకి ఘనీ వివరించగా, పఠాన్ కోట్ దాడిని ఘనీకి మోదీ వివరించారు. కాగా, పఠాన్ కోట్ ఉగ్రదాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మృత్యువాత పడగా, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు భారీ ఎత్తున గాలింపు చేపట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News