: పఠాన్ కోట్ దాడికి పాల్పడింది మేమే: ఐక్య జీహాదీ మండలి
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్ ప్రేరేపిత ఐక్య జీహాదీ మండలి ప్రకటించింది. జమ్మూకాశ్మీర్ లో టెర్రర్ గ్రూపులను ప్రోత్సహిస్తున్న పాకిస్థానే యునైటెడ్ జీహాదీ అసోసియేషన్ కి కూడా మద్దతు ఇస్తోంది. కాశ్మీర్ లోని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే హైవే స్కాడ్ తో ఇది సంబంధాలు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఐక్య జీహాదీ మండలి ప్రణాళికలు రచిస్తూ, అమలు చేస్తుంది. ఉగ్రవాది సయ్యద్ సలాహుద్దీన్ ఐక్య జీహాదీ మండలికి చీఫ్ గా పని చేస్తున్నాడు. అయితే ఈ ప్రకటనను భారత అధికారులు ఖండించారు. ఐక్య జీహాదీ మండలికి భారత్ పై దాడి చేసేంత వనరులు కానీ, సామర్థ్యం కానీ లేవని భారత ప్రభుత్వాధికారులు పేర్కొంటున్నారు.