: అమ్మకాలలో ‘హీరో’ రికార్డు!
కేవలం ఒక నెలలో రికార్డు స్థాయిలో సైకిళ్లను విక్రయించిన సంస్థ ‘హీరో’. గత డిసెంబరు నెలలో ఆరు లక్షల సైకిళ్లను విక్రయించినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ పంకజ్ ముంజాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక నెలలో ఆరు లక్షల సైకిళ్లు అమ్మడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారన్నారు. ఈ రికార్డును సాధించడం తమకు చాలా గర్వంగా ఉందని, ఈ స్ఫూర్తితో కొత్త ఏడాదిలో మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు పాటుపడతామని అన్నారు. 2014 డిసెంబరుతో పోల్చుకుంటే గత డిసెంబరులో అమ్మకాలు 20 శాతం ఎక్కువగా ఉన్నాయన్నారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో హీరో సైకిల్ అమ్మకాల సంఖ్య పెరిగినట్లు ఆయన చెప్పారు.