: చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని లీజ్ కు తీసుకోనున్న ‘అపోలో’


చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో వైద్య సంస్థ ఐదేళ్ల పాటు లీజుకు తీసుకోనుంది. ఇందుకుగాను ప్రభుత్వం అనుమతించింది. అలాగే, ఈ ప్రభుత్వాసుపత్రిలో అపోలో హెల్త్ అండ్ నాలెడ్జ్ సిటీ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో అపోలోతో వైద్య విధాన పరిషత్ అవగాహనా ఒప్పందం చేసుకునేందుకు ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా, 1983లో అపోలో వైద్య సంస్థలను డా. ప్రతాపరెడ్డి చెన్నైలో ప్రారంభించారు. అనంతరం దేశ వ్యాప్తంగా అపోలో శాఖలు విస్తరించాయి. భారత్ లోనే కాకుండా బంగ్లాదేశ్, కువైట్, కతార్ దేశాల్లో అపోలో వైద్య సంస్థలు సేవలందిస్తున్నాయి.

  • Loading...

More Telugu News