: హైదరాబాదులో ఇకపై రాత్రుళ్లు కూడా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు తెరిచేవుంటాయి


హైదరాబాదులో ఇకపై రాత్రుళ్లు కూడా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. వివిధ ప్రైవేటు సంస్థలు రాత్రి వేళల్లో పనిచేస్తుండటంతో ప్రజా అవసరాలకు అనుగుణంగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఇప్పటికే కార్మికులు, ట్రేడ్ యూనియన్లు, రాష్ట్ర ప్రతినిధులతో కార్మిక శాఖ త్రైపాక్షిక చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫలిస్తే ఇకపై రాత్రుళ్లు కూడా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు తెరిచేవుంటాయి.

  • Loading...

More Telugu News