: సీఎం కేసీఆర్ ను కలసిన గాయని పి.సుశీల


ప్రముఖ గాయని పి.సుశీల ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఐదురోజుల పాటు అయుత చండీ యాగం విజయవంతంగా నిర్వహించినందుకు ఆమె సీఎంను అభినందించారు. ప్రజలకోసం మరిన్ని మంచి పనులు చేయాలని సుశీల ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శాలువ కప్పి, జ్ఞాపిక అందించి ఆమెను సత్కరించారు. దేశం గర్వించదగ్గ గాయని సుశీల అని సీఎం పేర్కొన్నారు. తరువాత కేసీఆర్, ఆయన సతీమణి శోభ... సుశీలతో కలసి ఫోటో దిగారు.

  • Loading...

More Telugu News