: అంతర్గత భద్రత ఆందోళనకరంగా ఉంది: సోనియా గాంధీ


భారత్ అంతర్గత భద్రత ఆందోళనకరంగా ఉందని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. పఠాన్ కోట్ ఘటనలో మృతి చెందిన అమరజవాన్లకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన సందర్భంగా ఆమె ఢిల్లీలో మాట్లాడుతూ, ఉద్రిక్తంగా మారిన పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎయిర్ ఫోర్స్ వ్యూహాత్మక ఆస్తుల భద్రత, సిబ్బంది కుటుంబ సభ్యుల సంక్షేమంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను అణచివేసి, పౌరుల రక్షణ, వ్యూహాత్మక ఆస్తుల భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్రానికి సూచించారు. ఈ సందర్భంగా వీరమరణం పొందిన అమరజవాన్ల పరాక్రమాలను ఆమె కొనియాడారు.

  • Loading...

More Telugu News