: వాళ్లిద్దరికీ పరస్పరం పొగుడుకోవడానికే సమయం సరిపోతోంది!: రఘువీరా


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబుపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శలు చేశారు. చంద్రబాబు, వెంకయ్యలు పరస్పరం పొగుడుకుంటూ కాలం వెళ్లదీస్తూ, రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అసలు వాళ్లిద్దరికీ పొగడ్తలకే సమయం సరిపోతోందని, ఇక రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకునేది ఏందంటూ మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ హక్కులను చంద్రబాబు ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆయన 'ఏపీలో పులి, మోదీ దగ్గర పిల్లి' అని వ్యాఖ్యానించారు. ఇకనైనా కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధించాలని కోరారు.

  • Loading...

More Telugu News