: ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కుని, అతనిని కాల్చి చంపి వీరమరణం పొందిన సుబేదార్ మేజర్


పఠాన్ కోట్ ఘటనలో సుబేదార్ మేజర్ ఫతే సింగ్ వీర మరణం అందర్లోనూ స్పూర్తి నింపుతోంది. సుబేదార్ మేజర్ ఫతే సింగ్ చివరి క్షణాల గురించి ఆయన కుమార్తె మధు సింగ్ (25) మాట్లాడుతూ, ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లో చొరబడ్డారన్న సమాచారం రాగానే యూనిఫాం ధరించి విధుల్లోకి వెళ్లిపోయారని చెప్పారు. ఆయన వెళ్లిన కాసేపటి తర్వాత తమ ఇంటికి సమీపంలోనే తుపాకుల మోత మోగిందని ఆమె వెల్లడించారు. తుపాకి గుళ్ల బారిన పడకుండా తామంతా మంచం కింద పడుకున్నామని, చలిగా ఉన్నప్పటికీ అలాగే వుండిపోయామని ఆమె వెల్లడించారు. 1995 కామన్వెల్త్ గేమ్స్ లో షూటింగ్ లో స్వర్ణ, రజత పతక విజేత అయిన ఫతే సింగ్ ఉగ్రవాదులతో పోరాడుతుండగా, ఓ తీవ్రవాది ఎదురు పడ్డాడు. అంతే, ఆ ముష్కరుడి చేతిలోని తుపాకీని గుంజుకుని వాడిని కాల్చి హతమార్చారు. తరువాత వాడి సహచరుల కాల్పుల్లో ఆయన బలయ్యారు. సత్యం కోసం పోరాడాలని తన తండ్రి ఎప్పుడూ చెప్పేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. చెడును ఓడించేందుకు మనకు చేతనైనంతా చేయాలని సూచించేవారని, చెడుపై పోరాడుతూనే ఆయన అసువులు బాసారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

  • Loading...

More Telugu News