: కేసీఆర్ సర్కారుకు హైకోర్టు అక్షింతలు!


తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు మరోమారు ఆక్షేపించింది. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో పని చేసేందుకు టీచర్లు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ కోర్టుకు చెప్పిన వేళ, హైకోర్టు న్యాయమూర్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామాల్లో పని చేయని వారిపై చర్యలు తీసుకోలేకపోవడాన్ని తప్పుబట్టిన హైకోర్టు, వారిని విధుల నుంచి ఎందుకు తొలగించడం లేదని, ఇష్టం లేని వారు రాజీనామా చేయాలని, ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించింది. మహబూబ్ నగర్ జిల్లాలోని పాఠశాలల్లో సౌకర్యాల లేమిపై వచ్చిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టుకు అమికస్ క్యూరీ నివేదిక సమర్పించగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెండున్నరేళ్లుగా చాలా పాఠశాలల్లో ఆంగ్లం, హిందీ బోధించే ఉపాధ్యాయులే లేరని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీన్ని సీరియస్ గా ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News