: కదులుతారా? కదలమంటారా?... పాక్ కు భారత్ తుది హెచ్చరిక


పాక్ గడ్డపై మూలాలుండి, ఇండియాపై దాడులు చేస్తున్న ఉగ్రవాద సంస్థల పీచమణిచేందుకు కేవలం మూడు రోజుల సమయమిస్తున్నామని భారత్ పాకిస్థాన్ కు అల్టిమేటం పంపింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలపై 72 గంటల్లోగా చర్యలు తీసుకోకుంటే ఇండియా రంగంలోకి దిగక తప్పదని పాక్ ఎంబసీ అధికారులకు భారత ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను తక్షణం ధ్వంసం చేయాలని, అందుకు అవసరమైతే భారత వాయుసేన సహకరిస్తుందని కూడా చెప్పినట్టు సమాచారం. ఒకవేళ, పాక్ అందుకు సహకరించకుంటే, చర్చల ప్రక్రియ మొత్తానికే ఆగిపోతుందని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాగున్న ప్రాంతాలపై ఇండియా ప్రత్యక్ష దాడులకు దిగుతుందని హెచ్చరించింది. దీనిపై పాక్ స్పందన మాత్రం ఇంకా వెలువడలేదు.

  • Loading...

More Telugu News