: క్రికెటర్ల కోసం ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలి: లోధా కమిటీ సిఫారసు


దేశంలోని క్రికెటర్ల కోసం కూడా ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలని జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సూచించింది. బీసీసీఐ, ఐపీఎల్ కు ప్రత్యేక పరిపాలన సంఘాలు ఏర్పాటు చేయాలని, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు పరిమితంగా స్వయం ప్రతిపత్తి ఉండాలని ప్రతిపాదించింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లో 9 మంది సభ్యులుండాలని, బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారని చెప్పింది. బీసీసీఐ అధికారుల పదవీకాలం రెండు టర్మ్ లకు పరిమితం చేయాలని, బీసీసీఐ ఆఫీస్ బేరర్లుగా మంత్రులు, గవర్నమెంట్ సర్వెంట్స్ ఉండరాదని, బీసీసీఐ అధ్యక్షుడిగా రెండేళ్లకు మించి ఉండరాదని చెప్పింది. బీసీసీఐ రాజ్యాంగం, పద్ధతులు, పనితీరుపై అధ్యయనం చేసిన లోథా కమిటీ ఈ మేరకు రూపొందించిన తుది నివేదికను ఇవాళ సుప్రీంకోర్టు, బీసీసీఐకి సమర్పించింది. అందులోనే పైవిధంగా ప్రతిపాదనలతో పాటు సలహాలు, సూచనలు చేసింది. స్పాట్ ఫిక్సింగ్ కేసుపై గతంలో ఈ కమిటీ కీలక రిపోర్టు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో బీసీసీఐ పనితీరును కూడా పరిశీలించాలని సుప్రీంకోర్టు అప్పుడే ఆదేశించింది.

  • Loading...

More Telugu News