: బాంబు భయంతో ముంబై-ఇస్తాంబుల్ విమానం వెనక్కు!
ముంబై నుంచి టర్కీలోని ఇస్తాంబుల్ కు బయలుదేరిన విమానంలో బాంబు ఉండవచ్చన్న భయంతో అధికారులు వెనక్కు రప్పించారు. టర్కీ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం టేకాఫ్ అయిన తరువాత, ఓ సెల్ ఫోన్ అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ఆ ఫోన్ ఎవరిదని ప్రశ్నిస్తే, ఎటువంటి సమాధానమూ రాకపోవడంతో విమానం సిబ్బంది వెంటనే సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు తెలిపారు. ఆపై వారి ఆదేశాలతో విమానం వెనక్కు తిరిగి ముంబై చేరుకుంది. ఆ సెల్ ఫోన్ ఎవరిది? విమానంలో ఎందుకు వదిలి వెళ్లారన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.