: ఆ డబ్బు ఇవ్వకుంటే, మోదీపై మోసం, కుట్ర కేసు: ఆర్జేడీ


ఎన్నికల ముందు బీహార్ రాష్ట్రానికి ప్రధాని ప్రకటించిన రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ నిధులను తక్షణం రాష్ట్రానికి ఇవ్వాలని ఆర్జేడీ డిమాండ్ చేసింది. లేకుంటే ఆయనపై మోసం, కుట్ర, ఫోర్జరీ, నమ్మక ద్రోహం అభియోగాలు మోపి కేసును పెడతామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రఘువంశ్ ప్రతాప్ సింగ్ హెచ్చరించారు. ప్యాకేజీ పేరు చెప్పి బీహారీలను మోదీ మోసం చేయాలని చూశారని, ఈ విషయంలో కేసు పెట్టే ముందు న్యాయవాదులను సంప్రదిస్తున్నామని వివరించారు. బీహార్ పై శీతకన్నుతో ఇప్పటికే పలు స్కీములు, అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నిధులను తగ్గించిందని ఆయన అన్నారు. కాగా, ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో బీహారుకు ప్రత్యేక ప్యాకేజీలంటూ, మోదీ వేల కోట్ల రూపాయలను సాయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News