: నా మనవరాలు షారూక్ కొడుకుతో జోడీ కడితే బాగుంటుంది!: అమితాబ్ కోరిక


తన మనవరాలు, అభిషేక్, ఐశ్వర్యల గారాల పట్టీ ఆరాధ్య భవిష్యత్తుపై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెరిగి పెద్దయిన తరువాత తన మనవరాలు ఆరాధ్య, తనకు మంచి స్నేహితుడు షారూక్ ఖాన్ కుమారుడు అబ్రామ్ లు కలిసి వెండితెరపై కనిపిస్తే చూసేందుకు బాగుంటుందని అన్నారు. ప్రస్తుతం రణబీర్ - దీపిక, అలియా - సిద్దార్థ్, ఫవాద్ - సోనమ్ ల జంట మాదిరిగా, ఆరాధ్య - అబ్రామ్ లు కనిపిస్తారని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు. ఆరాధ్య కన్నా అబ్రామ్ చిన్నవాడని కాజల్ గుర్తు చేయగా, "ప్రేమకు వయసుతో నిమిత్తం లేదు" అని షారూక్ వ్యాఖ్యానించాడు. ఇదే విషయంపై బచ్చన్ స్పందిస్తూ, "ఆయన నోట్లో నెయ్యి, దూధ్ మలాయ్ వెయ్యాలి, అతని వ్యాఖ్యలే నిజం కావచ్చు" అన్నారు. తన తదుపరి చిత్రం 'వాజిర్' ప్రమోషన్ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News