: 2016 లక్ష్యాలను వివరించిన మార్క్ జుకర్ బర్గ్


కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఓ సహాయకుడిని తయారు చేసుకోవడమే 2016లో తన లక్ష్యమని ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. తాను అందుబాటులో లేకున్నా ఇంటిలో, ఆఫీసులో సహాయకారిగా అతడు పనిచేస్తాడని వివరించారు. "ఐరన్ మ్యాన్ లో జార్విస్ తరహాలో ఓ వ్యక్తి ఉంటే ఎలా ఉంటుందో ఊహింగలరా?" అని జుకర్ బర్గ్ తన ఫేస్ బుక్ పోస్టులో ప్రశ్నించారు. మార్వెల్ కామిక్ పుస్తకాలు, సినిమాల్లో కనిపించేలా ఆర్టిఫీషియల్లీ ఇంటెలిజెంట్ తనకు అవసరమని అన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగిస్తూ, తన అసిస్టెంట్ ను తయారు చేసే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని, తన గొంతును అర్థం చేసుకుని ఇంట్లో కాంతి, ఉష్ణోగ్రత, సంగీతం తదితరాలను నియంత్రించే పనులను సమర్థవంతంగా నిర్వహించేలా ఉంటాడని తెలిపారు. డేటా విజువలైజ్ సేవలనూ అందిస్తాడని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News