: ఉగ్రవాదుల కారుపై నీలి బుగ్గ... సెల్యూట్ చేసి మరీ పంపిన పోలీసులు


పంజాబ్ లోని పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. పంజాబ్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో స్వేచ్ఛగా సంచరించారు. పాక్ నుంచే వారికి ఇక్కడ అద్దె కారు బుక్కయింది. దర్జాగా కారు ఎక్కేసిన ఉగ్రవాదులు తమ నైజాన్ని గుర్తుపట్టి పారిపోయేందుకు యత్నించిన డ్రైవర్ ను చంపేశారు. ఆ తర్వాత గురుదాస్ పూర్ ఎస్పీగా పనిచేసి, ఇటీవలే పంజాబ్ ఆర్మ్ డ్ పోలీసు విభాగంలోని 75 బెటాలియన్ కు బదిలీ అయిన పోలీసు ఉన్నతాధికారి సల్వీందర్ సింగ్ కారును చేజిక్కించుకున్న ఉగ్రవాదులు ఎక్కడ కూడా క్షణం కూడా ఆగలేదు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ కు చేరుకునేందుకు వారు ప్రయాణించిన మార్గంలో రెండు చెక్ పోస్టులున్నాయి. అయితే సదరు చెక్ పోస్టుల్లో వీరి కారును ఏ ఒక్కరు కూడా చెక్ చేయలేదు. కారణమేంటంటే... సదరు కారుపై నీలి బుగ్గ ఉండటమే. సీనియర్ పోలీసు అధికారి అయిన సల్వీందర్ సింగ్ కు నీలి బుగ్గ కారు వినియోగించే వెసులుబాటు ఉంది. ఓ మంత్రగాడి వద్దకు వెళ్లేందుకు సల్వీందర్ సింగ్ తనకు ప్రభుత్వం కేటాయించిన కారునే వినియోగించారు. అంతేకాక తనిఖీలకు సల్వీందర్ వస్తున్నారన్న సమాచారం అక్కడి చెక్ పోస్టులకు చేరింది. దీంతో సల్వీందర్ కారులో ఉగ్రవాదులున్నా, ఆ కారును చెక్ పోస్టుల్లోని భద్రతా సిబ్బంది ఆపలేదు. అంతేకాదు, తమ బాసు వస్తున్నారన్న భావనతో సదరు కారుకు సెల్యూట్ చేసి మరీ ఉగ్రవాదులను ముందుకు పంపించారు. ఎయిర్ బేస్ కు అతి సమీపంలోకి సదరు కారులోనే వెళ్లిన ఉగ్రవాదులు దానిని బయటే వదిలేసి ఎయిర్ బేస్ లోకి చొరబడ్డారు.

  • Loading...

More Telugu News