: 12 అంతస్తుల మెట్లు ఎక్కి మరీ వచ్చింది...‘పద్మభూషణ్’కు సిఫారసు చేయమంది: గడ్కరీ


పద్మభూషణ్ పురస్కారం కోసం తన పేరును సిఫారసు చేయమని బాలీవుడ్ నటి ఆశాపరేఖ్ కోరిందని, ఆ విషయం అడగడం కోసం తమ అపార్టుమెంటులో లిఫ్టు పనిచేయకపోతే 12 అంతస్తుల మెట్లు ఎక్కి మరీ వచ్చిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. నాగపూర్ లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని బయట పెట్టారు. ఆశా ఈ విధంగా అడగటం తనకేమీ నచ్చలేదని అన్నారు. చిత్ర పరిశ్రమకు అపారమైన సేవలందించానని.. పద్మభూషణ్ పురస్కారానికి తాను వందశాతం అర్హురాలినని ఆశా తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అవార్డులు, పురస్కారాలు తమకు ఇప్పించాలని సిఫారసు కోరుతూ తన వద్దకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని నితిన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News