: సింగపూర్ ను తలదన్నేలా నెల్లూరును అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు


సింగపూర్ ను తలదన్నేలా నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేస్తానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరులో నిర్వహించిన జన్మభూమి- మన ఊరు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, సింగపూర్ లో ఒక పోర్టు ఉంటే నెల్లూరుకు రెండు పోర్టులు వచ్చే అవకాశముందన్నారు. నెల్లూరు జిల్లాలో టూరిజం అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.60 కోట్లు మంజూరు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కేంద్రం నుంచి వెంకయ్యనాయుడి సహకారంతో ఎన్నో ప్రాజెక్టులు మనకు వస్తున్నాయన్నారు. భవిష్యత్ లో కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని.. సంగం, నెల్లూరు బ్యారేజ్ పనులను వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. వికలాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని, అంగవైకల్యం గల ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News