: నగరిలో ‘జన్మభూమి’కి హాజరుకాని రోజా!
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నగరిలో జరుగుతున్న జన్మభూమి-మన ఊరు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రోజా హాజరు కాలేదు. ఎమ్మెల్యే రోజా గైర్హాజరుపై మంత్రి బొజ్జల ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కాల్ మనీ వ్యవహారంపై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడిపై ఎమ్మెల్యే రోజా అభ్యంతరకర వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారంటూ అసెంబ్లీ నుంచి ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.