: నెల్లూరు జిల్లాలో భూకంపం.. బాబు పర్యటనలో మార్పులు!


నెల్లూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. నెల్లూరు నగరంతో పాటు వింజమూరు, దత్తలూరు, నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో సుమారు 2 సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. కాగా, ఈ సంఘటనతో నేడు జరగాల్సిన చంద్రబాబు పర్యటనను కుదిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొంచెం సేపట్లో ఉదయగిరిలో పర్యటించనున్న బాబు, ఆపై జరగాల్సిన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News