: 5 కీలక చట్ట సవరణలకు రాష్ట్రపతి ముద్ర


పార్లమెంటు ఆమోదించిన 5 కీలక చట్ట సవరణ బిల్లులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర పడింది. మధ్యవర్తిత్వం, సర్దుబాటు చట్ట సవరణ, షెడ్యూల్డ్ కులాలు, తెగలపై వేధింపుల చట్ట సవరణ, కమర్షియల్ కోర్టులు, కమర్షియల్ డివిజన్ అండ్ అపిలేట్ డివిజన్ ఆఫ్ హైకోర్టుల చట్టానికి సవరణ, అటామిక్ ఎనర్జీ చట్ట సవరణలతో పాటు బోనస్ ల చెల్లింపు చట్ట సవరణలకు ఆయన ఆమోదం తెలిపారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, అటామిక్ ఎనర్జీ చట్ట సవరణతో ప్రభుత్వ రంగ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ మిగతా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సాగవచ్చు. ఇక బోనస్ చట్ట సవరణతో, ఇప్పటి వరకూ ఓ ఉద్యోగి నెలలో గరిష్ఠంగా రూ. 3,500 వరకూ బోనస్ తీసుకునే వీలుండగా, అది రూ. 7 వేలకు పెరగనుంది. ఇక ఎస్సీ ఎస్టీ చట్ట సవరణ తరువాత, ఓ దళిత మహిళను ఆమె అనుమతి లేకుండా ముట్టుకున్నా తప్పు కానుంది. మహిళలను దుర్భాషలాడటం, లైంగిక వేధింపులు, దేవాలయానికి దేవదాసిగా మార్చడం వంటి వన్నీ నేరాలవుతాయి. ఈ బిల్లులను ఇటీవలి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News