: బ్రిటన్ వెబ్ సైట్లో నేతాజీ కొత్త ఫైల్స్!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్య మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఇంతవరకూ వెలుగులోకి రాని, ఆయన ఆఖరి రోజుల వివరాలతో కూడిన కొన్ని ఫైళ్లను బ్రిటన్ వెబ్ సైట్ ఒకటి విడుదల చేసింది. విమాన ప్రమాదం తరువాత ఆయన చైనాలో కనిపించారన్న వాదనలు అవాస్తవమని ఈ ఫైళ్లలో ఉన్నాయి. ఆయన చైనాలో లేడని చెబుతూ, బీజింగ్ లోని భారత ఎంబసీ పంపిన టెలిగ్రామ్ కాపీని 'బోస్ ఫైల్స్ డాట్ ఇన్ఫో' అనే వెబ్ సైట్లో ఉంచారు. 1952లో బోస్ అభిమాని గోస్వామి, ఓ ఫోటోను చూపుతూ, అందులో ఉన్నది బోస్ అని చెప్పగా, దాని ధ్రువీకరణకు ఆ చిత్రాన్ని చైనాలోని భారత అధికారులకు పంపగా, అందులో ఉన్నది బోస్ కాదని సమాచారం వచ్చింది. దానికి సంబంధించినదే ఈ టెలిగ్రామ్. ఇక 1945లో నేతాజీ రష్యాకు వెళ్లారన్న వాదనలను ఖండిస్తూ ఉన్న ఫైళ్లను గత నెలలో ఇదే వెబ్ సైట్లో ఉంచిన సంగతి తెలిసిందే.