: 'నేను ఆత్మహుతి దాడి పనిలో ఉన్నాను' తల్లితో ఉగ్రవాది ఫోన్ సంభాషణ!


పఠాన్ కోట్ పై ఉగ్రదాడులు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ఓ ఉగ్రవాది తన తల్లికి చేసిన ఫోన్ సంభాషణ వివరాలను సెక్యూరిటీ ఏజన్సీలు వెల్లడించాయి. శనివారం తెల్లవారుఝామున 2 గంటల ప్రాంతంలో ఓ ఫోన్ కాల్ లో 'సూసైడ్ మిషన్' అని అన్నట్టు రికార్డయిందని వివరించారు. ఆపై అవతలి వైపు నుంచి నిశ్శబ్దమే సమాధానంగా రాగా, "నేను ఆత్మహుతి దాడి పనిలో ఉన్నాను. మా అందరినీ అల్లా చూసుకుంటాడు" అని అన్నాడు. ఆపై రెండు గంటల వ్యవధిలోనే ఈ బృందం ఎయిర్ బేస్ పై దాడికి దిగింది. ఈ ఫోన్ కాల్స్ పాకిస్థాన్ లోని గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లాయని, వీరు పంజాబీ, ముల్తానీ భాషల్లో మాట్లాడుకున్నారని తెలుస్తోంది. 70 సెకన్ల పాటు ఒక కాల్, 87 సెకన్ల పాటు సాగిన మరో కాల్ ను అధికారులు గుర్తించారు. రెండో కాల్ లో, అంతా మన నియంత్రణలోకి వచ్చిందా? అన్న ప్రశ్నకు సమాధానంగా అవునని ఉగ్రవాది అనడం, ముందుగా అనుకున్నట్టుగా పేల్చేయండని సలహా ఇవ్వడం రికార్డయింది. ఇదే సమయంలో "అతనికి అర్థమయ్యేలా చెప్పు. మేం గమనిస్తున్నాం (ఉసే సమ్ జాహో, హమే ఫిక్ర్ హై)" అన్న వ్యాఖ్యలు కూడా రికార్డు కావడంతో, ఇవి ఎవరి గురించి వచ్చాయన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ఇక మరో కాల్ 32 సెకన్ల పాటు సాగింది.

  • Loading...

More Telugu News