: వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వండి: హైకోర్టు


2014 జూన్ 8న హైదరాబాదులోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో కొట్టుకుపోయి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సుదీర్ఘ విచారణ అనంతరం బాధిత కుటుంబాలకు ఊరటనిస్తూ తీర్పు చెప్పింది. ఘటనలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడింది. బాధితుల కుటుంబ సభ్యులకు 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారంలో 60 శాతాన్ని బియాస్ నది ఆనకట్ట బోర్డు చెల్లించాలని, 30 శాతాన్ని కళాశాల యాజమాన్యం చెల్లించాలని, మిగిలిన పది శాతాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని హిమాచల్ హైకోర్టు ఆదేశించింది. పరిహారంపై 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది. ఆనాటి ఘటనలో మృతి చెందిన వారిలో ఆరుగురు విద్యార్థినులు కూడా వున్నారు.

  • Loading...

More Telugu News