: వైద్యులు సుదీర్ఘ సెలవు పెడితే...ఇక శాశ్వత సెలవే: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వాసుపత్రుల్లో పని చేసే వైద్యులు సుదీర్ఘ సెలవులో ఉంటే వారికి 'శాశ్వత సెలవు' ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. విజయనగరం జిల్లా బొండపల్లిలో మూడో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రుల్లో సిబ్బంది అటెండెన్స్ కోసం థంబ్ ఇంప్రెషన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. విభజన ఇబ్బందుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బయటపడలేదని ఆయన పేర్కొన్నారు. పిల్లలను బాగా చదివించుకుని, ఆదాయమార్గాలు పెంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువే చేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News