: పనిచేయకుంటే... ప్రమోషన్లు కూడా ఉండవు!: మహిళా అధికారికి చంద్రబాబు చీవాట్లు


‘‘క్షేత్ర స్థాయి అధికారులదే ప్రభుత్వ పాలనలో కీలక భూమిక. అలాంటి గురుతర బాధ్యతను మరిచి వ్యవహరిస్తే సహించేది లేదు. పనిచేయకుంటే ప్రమోషన్లు కూడా ఉండవు’’ అని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు. ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా బొందపల్లిలో కొద్దిసేపటి క్రితం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన గ్రామస్థులతో ముచ్చటించారు. వారు చేసిన పలు ఫిర్యాదులతో అక్కడే ఉన్న రెవెన్యూ శాఖకు చెందిన ఓ మహిళా అధికారిని వేదికపైకి పిలిచిన చంద్రబాబు, ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. గ్రామ జనాభా, రైతుల సంఖ్య, భూమి విస్తీర్ణం తదితరాలపై ఆయన ఒకేసారి ప్రశ్నలు సంధించడంతో సదరు మహిళా అధికారి తడబడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు పనిచేయకుంటే ప్రమోషన్లు కూడా రావని ఆమెను హెచ్చరించారు.

  • Loading...

More Telugu News