: శేషాచలం అడవుల్లో కృష్ణ జింకను చంపేసిన వేటగాళ్లు... అరెస్ట్ చేసిన పోలీసులు


విలువైన ఎర్రచందనం చెట్లకు ఆలవాలమైన శేషాచలం అడవులు అరుదైన కృష్ణ జింకలకూ ఆవాసంగా మారాయి. అయితే ఎర్రచందనం చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్న స్మగ్లర్లు దుంగల అక్రమ రవాణాతో కోట్లకు పడగలెత్తారు. అడవుల్లోని ఎర్రచందనం చెట్ల సంఖ్యను తగ్గించేశారు. తాజాగా ఈ అడవుల్లోని కృష్ణ జింకలపై వేటగాళ్ల కన్ను పడింది. నిన్న రాత్రి గుట్టుచప్పుడు కాకుండా అడవుల్లోకి వెళ్లిన ఇద్దరు వేటగాళ్లు ఓ కృష్ణ జింకను చంపేశారు. చిత్తూరు జిల్లాలోని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత మండలం చంద్రగిరి పరిధిలో ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు వీరు తారసపడ్డారు. వెంటనే స్పందించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు వేటగాళ్లను అరెస్ట్ చేశారు. కృష్ణ జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News