: మళ్లీ అదే తంతు.. తెలుగు విద్యార్థులకు మళ్లీ చేదు అనుభవం!


ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో 15 మంది తెలుగు విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. సియాటిల్ ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని నిలిపివేశారు. దీంతో భారత్ కు వారు తిరుగు పయనమయ్యారు. రేపు ఉదయం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాధిత విద్యార్థులు చేరుకోనున్నారు. ఈ సంఘటన పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెనుదిరిగిన విద్యార్థులు వరంగల్ జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. కాగా, కొన్ని రోజుల క్రితం కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ (ఎస్ యూవీ), నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ (ఎన్ పీయూ)లలో చేరేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను వెనక్కి పంపారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించని కారణంగా సదరు విద్యార్థులు వెనుదిరిగిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News