: ఐఎస్ ను అడ్డుకోవడంలో ముస్లింల పాత్ర అమోఘం: రాజ్ నాథ్ సింగ్


భారత్ లో ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ ప్రాబల్యం పెరగకుండా ఉండడంలో ముస్లిం కుటుంబాల పాత్ర ఎంతో ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని ముస్లిం కుటుంబాల విలువలకు గర్విస్తున్నానని అన్నారు. పిల్లలు ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల భావజాలానికి ఆకర్షితులు కాకుండా కుటుంబ సభ్యులు చూస్తున్నారని ఆయన వివరించారు. దేశంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండడానికి, నిరక్షరాస్యులుగా మిగలకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News