: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
టీడీపీలో తాను చేరేందుకు సిద్ధమంటూ ఇటీవల బహిరంగంగా ప్రకటించిన జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై ఆ ప్రాంత టీడీపీ ఇంచార్జ్ నేత రామసుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ, పెంచి పోషించిన వైఎస్ కుటుంబానికి ఆయన ద్రోహం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. అలాగే విడాకులు తీసుకోకుండా మరో పెళ్లికి సిద్ధమైనట్లుగా... తన పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారతాననడం ఎంతవరకు సబబని రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. పలు కేసుల్లో ఉన్న తన వియ్యంకుడు కేశవరెడ్డిని కాపాడేందుకే టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే ముందు తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలన్నారు.