: గ్యాస్ వినియోగదారులకు అత్యవసర కాల్ సెంటర్ ప్రారంభం
గ్యాస్ వినియోగదారుల సమస్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర కాల్ సెంటర్ ను ప్రారంభించింది. 24 గంటల సర్వీసులో నిర్వహించే ఈ కాల్ సెంటర్ ను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ ప్రారంభించారు. అవసరమైన వారు '1906' కాల్ సెంటర్ నంబర్ కు ఫోన్ చేయాలని కోరారు. వచ్చే మూడు సంవత్సరాల్లో దేశంలోని ప్రతి కుటుంబానికి ఎల్పీజీ గ్యాస్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రధాన్ చెప్పారు. 2016 సంవత్సరాన్ని ఎల్పీజీ వినియోగదారుల సంవత్సరంగా ప్రకటించామన్నారు. అలాగే 2018 నాటికి గృహ వినియోగదారులకు నాణ్యమైన గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. ఆన్ లైన్ లో గ్యాస్ చెల్లింపునకు కేంద్రం చర్యలు తీసుకుందని ఉద్ఘాటించారు.