: ఏలూరులో 'తల్లీబిడ్డల' పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం కొత్త ఏడాదిలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'తల్లీబిడ్డల' పథకాన్ని ఏలూరులోని సెంట్రల్ ఆసుపత్రిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన తల్లీబిడ్డల ప్రత్యేక విభాగాన్ని కూడా సీఎం ప్రారంభించారు. 100 పడకలతో ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు చంద్రబాబు తెలిపారు. అలాగే 102 కాల్ సెంటర్, ఎన్టీఆర్ వైద్య పరీక్ష, టెలీ రేడియాలజీ పథకాలను కూడా సీఎం ప్రారంభించారు.