: హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన ‘బాహుబలి’యూనిట్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2015లో రూపొందిన చిత్రం బాహుబలి ఎన్ని రికార్డులు, సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. నూతన ఏడాది సందర్భంగా ఈ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతున్న ఒక ట్వీట్ తో పాటు ఈ వీడియోను బాహుబలి చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. బాహుబలి చిత్రంలో ప్రభాస్, తమన్నా ఉన్న ఒక దృశ్యాన్ని ఈ వీడియోలో పోస్ట్ చేశారు.