: రాజకీయ నేతలు ట్వీటు జారితే అంతే... వెనక్కు తీసుకోలేరు!


రాజకీయ నేతలు పొరపాటున ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యను ట్విట్టర్ లో పెట్టి, ఆపై దాన్ని డిలీట్ చేశాంలే అనుకుంటే ఇకపై కుదరదు. ప్రజా జీవితంలో ఉన్న నేతల డిలీటెడ్ ట్వీట్లను తిరిగి చూపాలని ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది. ప్రజా చర్చల్లో మరింత పారదర్శకత తీసుకురావడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాక్ డోర్సీ వెల్లడించారు. పొలిటీషియన్లు ఒకసారి ట్వీట్ చేసి ఆపై డిలీట్ చేసిన ట్వీట్లను ఓ ప్రత్యేక విండోలో చూపుతామని ఆయన తెలిపారు. దీనికి 'పొలిట్ ఊప్స్' అని పేరు పెట్టినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News