: 'ఫ్రీ బేసిక్స్'తో డిజిటల్ ఇండియా చచ్చినట్టే: నందన్ నిలేకని సంచలన వ్యాఖ్య


ఫేస్ బుక్ ప్రారంభించిన ఉచిత ఇంటర్నెట్ ప్రచారం డిజిటల్ ఇండియాను చంపేస్తుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ ప్రాజెక్టు మూలస్తంభంగా గుర్తింపు పొందిన నందన్ నిలేకని అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ స్వేచ్ఛకు ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. ఉచిత ఇంటర్నెట్ అంటూ ఫేస్ బుక్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తోందని, ఈ లెక్కన ఎంత ఆదాయాన్ని ఆ సంస్థ అంచనా వేస్తోందో ఊహించాలని అన్నారు. నెట్ ఉచితంగా ఇచ్చి, ఇతర కంపెనీలను దెబ్బకొట్టడం ద్వారా తమ ఆధిపత్యానికి అడ్డంకులు లేకుండా చూసుకోవాలన్నదే సామాజిక మాధ్యమాల ఉద్దేశమని అన్నారు. ఫేస్ బుక్ ను వాడుతున్న 13 కోట్ల మంది యూజర్లను ఉచిత ఇంటర్నెట్ కు మద్దతు పలకాలని ఆ సంస్థ ఈ-మెయిల్స్ రూపంలో కోరుతోందని, ట్రాయ్ కి సిఫార్సులు పంపాలని ఒత్తిడి తెస్తోందని అన్నారు. ఫ్రీ బేసిక్స్ రావడంతోనే డిజిటల్ ఇండియా చచ్చిపోయినట్టేనని అన్నారు. ఇంటర్నెట్ కొన్ని కంపెనీలకే పరిమితమైతే, ప్రతి ఒక్కరినీ డిజిటల్ సేవల పరిధిలోకి తేవాలన్న మోదీ కల నెరవేరదని నందన్ నిలేకని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News