: హెచ్ఎంటీ తలుపులు తెరచుకున్నాయి!... తుది ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన రాణిబాగ్ యూనిట్


గడియారాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రసిద్ధ సంస్థగా పేరుగాంచిన హిందుస్థాన్ మెషీన్ టూల్స్ (హెచ్ఎంటీ) రెండేళ్ల తర్వాత తిరిగి తన ఉత్పత్తిని ప్రారంభించింది. ఇప్పటికే బుక్కైన ఆర్డర్ల మేరకు తుది విడత వాచీల తయారీకి ఆ సంస్థ న్యూ ఇయర్ డే నాడు శ్రీకారం చుట్టింది. ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న రాణిబాగ్ లో ఆ సంస్థకు చెందిన ఓ యూనిట్ ఉంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోనూ ఆ సంస్థకు యూనిట్ ఉన్నా, అదెప్పుడో మూత పడింది. రాణిబాగ్ లోని యూనిట్ కూడా రెండేళ్లుగా మూతపడే ఉంది. అయితే బెంగళూరులోని ఆ సంస్థ ఔట్ లెట్ నుంచి జారీ అయిన ఆర్డర్ మేరకు 1.5 కోట్ల విలువ చేసే గడియారాలను ఉత్పత్తి చేసేందుకు రాణిబాగ్ యూనిట్ నేడు కార్యకలాపాలు ప్రారంభించింది. మార్చిలోగా ఈ ఆర్డర్ మేర వాచీలను ఉత్పత్తి చేసిన తర్వాత హెచ్ఎంటీ ఆ వెనువెంటనే శాశ్వతంగా మూతపడనుంది. హెచ్ఎంటీ కనుమరుగు కానుండగా, ఆ సంస్థ స్థలంలో ఆర్డినెన్స్ (ఆయుధాల) ఫ్యాక్టరీ కార్యకలాపాలు ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News