: అమరావతి అమరేశ్వరుడికి 40 కిలోల వెండి సమర్పించిన అజ్ఞాత భక్తుడు!


గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరుడికి హైదరాబాద్ కు చెందిన ఒక అజ్ఞాత భక్తుడు సుమారు 40 కిలోల వెండిని సమర్పించాడు. దీని విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో ఎన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆలయంలోని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మండపం నుంచి నందిమండపంలోకి ప్రవేశించే ద్వారానికి వెండి తొడుగు వేయడానికి 40 కిలోల వెండిని ఓ అజ్ఞాత భక్తుడు సమర్పించినట్లు చెప్పారు. సదరు భక్తుడు తన పేరు వెల్లడించడానికి నిరాకరించాడని ఈవో పేర్కొన్నారు. వచ్చే శివరాత్రి నాటికి ఆ ద్వారానికి వెండి తొడుగు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News