: బాలీవుడ్ సెలబ్రిటీల లాస్ట్ సప్పర్!
2015లో బాలీవుడ్ సెలబ్రిటీల తమ లాస్ట్ సప్పర్ అభిరుచులు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉన్నాయి. డిసెంబర్ 31 రాత్రి తాము తీసుకునే ఆహారం గురించి వారేమంటున్నారంటే.. జాన్ అబ్రహం... ఫిట్ నెస్ కోసం 365 రోజులు కష్టపడే వ్యక్తిని నేను. రెగ్యులర్ డైట్ కే నేను కట్టుబడి ఉంటాను. న్యూ ఇయర్ సందర్భంగా ఎటువంటి ప్రత్యేక ఆహారం తీసుకోను. నో సాల్ట్.. నో షుగర్.. నో అన్ హెల్థీ ఫుడ్స్. పరిణీతి చోప్రా... గత ఫిబ్రవరి నుంచి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. న్యూ ఇయర్ ప్రత్యేకమైన సందర్భం కనుక పిజ్జా తినడానికి ఇష్టపడతాను. ప్రపంచంలో అన్నింటికంటే నాకు ఇష్టమైన ఆహారం పిజ్జా. అర్జున్ కపూర్... న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇంటి ఆహారమే నేను తీసుకుంటాను. ఎందుకంటే, త్వరలో ప్రసారం కానున్న టివి రియాల్టీ షో నిమిత్తం అర్జెంటీనా షూటింగ్ లో చాలా రోజులు గడిపాను. దీంతో ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. రాజ్మా చావల్, జంగ్లీ మటన్ ని లాగించేస్తాను.