: కీర్తీ ఆజాద్ కు బీజేపీ షోకాజ్ నోటీసులు
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై యుద్ధం ప్రకటించిన బీజేపీ ఎంపీ కీర్తీ ఆజాద్ ను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో తెలపాలంటూ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆజాద్ ను ఆదేశించింది. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఛైర్మన్ గా ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ అవకతవకలకు పాల్పడ్డారని కీర్తీ ఆజాద్ ఆరోపించిన సంగతి తెలిసిందే.