: భారత్ లో అదో చిన్న ప్రపంచం...అక్కడ 50 దేశాల వారున్నారు!
భారత్ లో ఓ చిన్న ప్రపంచం ఉందని మీకు తెలుసా? అది కూడా ఎక్కడో కాదు మన పక్కనే. తమిళనాడులోని వీలుప్పురమ్ జిల్లాలో ఆరోవిల్లే పట్టణం ఉంది. ఈ పట్టణాన్ని 1968లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ అరబిందో శిష్యురాలు మిర్ర అల్పాస్సా నిర్మించారు. ఈ పట్టణం నిర్మించిన మొదట్లో 124 దేశాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకునే వారు. ఇప్పుడీ పట్టణంలో 50 దేశాలకు చెందిన 2,345 మంది ప్రజలు నివాసం వుంటున్నారు. మానవులంతా ఒక్కటే, శాంతి సమానత్వంతో ఎక్కడైనా నిరభ్యంతరంగా జీవించవచ్చు అనే సిద్ధాంతంతో ఈ పట్టణాన్ని ఆమె నిర్మించారు. ఆమె ఆశయాల ప్రకారమే ఇక్కడి వారు కుల, మత, జాతి అంతరాలు లేకుండా ఆధ్యాత్మిక జీవనం సాగిస్తున్నారు. ఈ పట్టణం స్వయం ప్రతిపత్తిగల ప్రాంతం. ఇక్కడి పరిపాలన మూడు విభాగాలుగా ఉంటుంది. ప్రజా అసెంబ్లీ, ప్రభుత్వ మండలి, అంతర్జాతీయి సలహా మండలి ఉంటాయి. వీటి ద్వారానే పట్టణ పరిపాలన సాగుతుంది. ఈ పట్టణ బాధ్యత మానవ వనరుల శాఖ తీసుకుంటుంది.