: తెలంగాణలోని 1000 గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1000 గ్రామ పంచాయతీలకు భవనాలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గ్రామ పాలన వ్యవస్థను బలోపేతం చేసేందుకే భవనాల నిర్మాణం చేపడతున్నామని తెలిపారు. ఇకపై రాష్ట్రంలో సొంత భవనంలేని గ్రామ పంచాయతీ ఉండబోదన్నారు. అసలు భవనాలే లేని 344 పంచాయతీలకు కొత్తగా భవనాలను నిర్మిస్తామని చెప్పారు. వాటితో పాటు శిథిలావస్థకు చేరిన 656 పంచాయతీల భవనాల స్థానంలో కొత్త భవనాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. కొత్త భవనాల మంజూరుపై రేపు ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.