: క్లాస్ 3,4 కేటగిరి ఉద్యోగాల నియామకాల్లో రేపటి నుంచి ఇంటర్వ్యూలు ఉండవు: మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ భవిష్యత్తు ఉద్యోగులకు కొత్త సంవత్సర కానుక ప్రకటించారు. ఈ ఏడాది జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రకటించిన ఓ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. 2016 జనవరి 1 నుంచి క్లాస్ 3, 4 కేటగిరీ ఉద్యోగాల నియామకాల్లో ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించబోమని ప్రకటించారు. ఈ మేరకు ఇంటర్వ్యూ విధానాన్ని తొలగిస్తున్నట్టు ప్రధాని ట్విట్టర్ లో తెలిపారు. ఈ స్థాయి ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు పెడితే అవినీతి పెరిగిపోతుందని, దాన్ని నియంత్రించేందుకే వాటిని తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు.