: నిప్పులు చెరిగే నియంత కంట కన్నీరు!


అమెరికా దృష్టిలో ఆయన అత్యంత క్రూరమైన నియంత. అలాంటి వ్యక్తి కంట్లోంచి కన్నీరొలికింది. దక్షిణ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ అన్ కన్నీరు కార్చారు. కఠినమైన వ్యక్తిగా, అడ్డం వస్తే కుటుంబ సభ్యులను సైతం హతమార్చేందుకు కూడా వెనుకాడని వ్యక్తిగా కింగ్ జాంగ్ అన్ కు పేరు. ఆయన వ్యవహారశైలిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. హక్కులను కాలరాస్తున్నాడని, అంతర్జాతీయ సమాజానికి కంటగింపుగా మారాడని అమెరికా తూర్పారపడుతుంది. అలాంటి కింగ్ జాంగ్ అన్ కు సన్నిహితంగా ఉండే కిమ్ యాంగ్ గావ్ రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉత్తర కొరియాతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవడానికి ఆయన విశేషమైన కృషి చేస్తున్నారు. అంతే కాకుండా జాంగ్ అన్ తండ్రికి కూడా అత్యంత విశ్వాస పాత్రుడిగా ఆయన మెలిగారు. అదే విధానం అన్ తో కూడా కొనసాగించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి. దీంతో అతని పార్థివదేహానికి నివాళులర్పించేందుకు వచ్చిన అన్ విషణ్ణ వదనంతో... విగత జీవిగా పడి ఉన్న యాంగ్ గావ్ బుగ్గలను ప్రేమతో నిమిరారు. అనంతరం కన్నీటిని అదుపుచేసుకోలేకపోయారు. అనంతరం మాట్లాడుతూ, యాంగ్ గావ్ స్థానాన్ని తన మనసులో ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News