: సోషల్ మీడియాలో హోరెత్తింది వీటి గురించే...!


2015 మరికొన్ని గంటల్లో ముగుస్తోంది. ఈ ఏడాది సోషల్ మీడియా విజృంభించింది. సోషల్ మీడియా మాధ్యమంగా వాడీ వేడి చర్చలు నడిచాయి. ఈ సందర్భంగా పలు సందర్భాల్లో నెటిజన్లు అత్యధికంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరును, ఆ తరువాత ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పేరును ప్రస్తావించినట్టు సోషల్ మీడియా అనలిటిక్స్ బ్లూఓషియన్ మార్కెట్ ఇంటెలిజన్స్ రూపొందించిన జాబితా వెల్లడించింది. మోదీ పేరును 34,16,000 మంది ప్రస్తావించగా, సల్లూ భాయ్ పేరును 27,29,000 మంది ప్రస్తావించారు. వీదేశీ పర్యటనలతో ప్రధాని పేరు హోరెత్తగా, హిట్ అండ్ రన్ కేసు కారణంగా సల్మాన్ పేరు సోషల్ మీడియాలో హోరెత్తింది. భారత్, పాక్ సిరీస్ పై 17 లక్షల మంది, ఐపీఎల్ పై 15 లక్షల మంది, మత అసహనంపై 8 లక్షల మంది సోషల్ మీడియాలో ట్వీట్లతో హోరెత్తించారు.

  • Loading...

More Telugu News