: ఇదేనా న్యాయం? అత్యాచార నిందితుడికి బూటు దెబ్బ!
ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులకి యూపీలోని పంచాయతీ పెద్దలు విధించిన శిక్ష ఏంటో తెలుసా? బూటు తీసుకుని బహిరంగంగా చెంపపై కొట్టడం, ముఖంపై ఇంకు చల్లడం! మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామంలో పది రోజుల క్రితం ఇద్దరు కామాంధులు ఓ మహిళపై అత్యాచారం చేశారు. విషమ పరిస్థితుల నుంచి బాధితురాలు కోలుకుంది. విషయం తెలుసుకున్న పంచాయతీ పెద్దలు సమావేశమై కేసు విచారించారు. తొలుత ఓ ఐదు లక్షల రూపాయలు జరిమానా కట్టమన్నారు. అందుకు నిందితులు ఒప్పుకోకపోవడంతో నలుగురూ చూస్తుండగా శిక్షించాలని తీర్పిచ్చారు. ఇక, ఇదేనా న్యాయం? అని ప్రశ్నించడం తప్ప సామాజికవేత్తలు ఏమీ చేయలేని పరిస్థితి. పోలీసులు పట్టించుకోకనే పంచాయతీలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.