: అభిమానులకు మహేశ్ న్యూ ఇయర్ కానుక!


టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు కొత్త సంవత్సరం కానుకగా, 'బ్రహ్మోత్సవం' టీజర్ రేపు విడుదల కానుంది. ఉదయం 9:36 గంటలకు బ్రహ్మోత్సవం చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నామని సినిమా నిర్మాతలు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. "ఏ సూపర్ వే టూ స్టార్ట్ న్యూ ఇయర్!" అంటూ ట్వీట్ చేశారు. మహేశ్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో మహేశ్ తో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాన్ని తీసిన శ్రీకాంత్ అడ్డాల దీనికి దర్శకుడు.

  • Loading...

More Telugu News