: ప్రతి రోడ్డునూ ఎక్స్ ప్రెస్ హైవే చేస్తాం: మోదీ


ఇండియాలోని ప్రధాన పట్టణాల మధ్య ఉన్న అన్ని రోడ్లనూ ఎక్స్ ప్రెస్ హైవేలుగా మార్చాలన్నదే ఎన్డీయే ప్రభుత్వ అభిమతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ హైవేకు శంకుస్థాపన సందర్భంగా యూపీ పరిధిలోని నోయిడా సమీపంలో జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎక్స్ ప్రెస్ హైవేలను కాలుష్య రహితంగా చేస్తామని, సులువుగా, వేగంగా ప్రయాణించే వీలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల రాజధానులను, ఇతర ప్రధాన నగరాలను ఎక్స్ ప్రెస్ హైవేలతో అనుసంధానం చేస్తామన్నారు. దశలవారీగా ఈ పనులు ప్రారంభమవుతాయని వివరించారు. కాగా, ఈ కార్యక్రమానికి యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరు కాలేదు.

  • Loading...

More Telugu News